V1News Telangana

best news portal development company in india

వైభవంగా సీతారాముల రథోత్సవం ….

SHARE:

– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు

– పురుషులతోపాటు, మహిళలు కూడా మేము సైతం అంటూ శోభాయాత్రలో భాగస్వామ్యం

– ఆటపాటలతో, భజన సంకీర్తనలతో ఉత్సాహంగా సాగిన శోభాయాత్ర

– బాణాసంచా పేల్చి సందడిగా సంబరాలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సోమవారం రోజు తెల్లవారుజామున 3:30 గంటల నుండి గ్రామ ప్రజలందరూ కలిసి సీతారాముల ఉత్సవ విగ్రహాలను రథంలో కూర్చోబెట్టి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా రథోత్సవం శోభాయాత్ర నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో మంగళహారతులతో స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పుల చప్పుల్లు, భజన సంకీర్తనలు, డీజే పాటలతో భక్తులు మైమరచిపోయి నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.రామనామ స్మరణలతో గ్రామంలోని వీధులన్నీ మారుమ్రోగిపోయాయి. బాణాసంచా పేల్చి సందడిగా సంబరాలు జరుపుకున్నారు. పురుషులతోపాటు.. మహిళలు తాము సైతం సీతారాముల రథోత్సవంలో భాగస్వాములమవుతామని ఉత్సాహంగా రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవం అనంతరం గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను స్వామివారి కల్యాణం, అన్నప్రసాద్ వితరణ గ్రామ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. స్వామివారి రథోత్సవం కార్యక్రమం కూడా అందరి సహకారంతో ఘనంగా జరిగిందని అన్నారు. సీతారాముల కృపాకటాక్షాల వలన గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా జీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరిగె నారాయణ, పురోహితులు నారాయణ శర్మ, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ (నందు) రెడ్డి, గ్రామ అధ్యక్షులు అయినాల లింగం, రాజేశ్వర్ రెడ్డి, గొడిసెల నరసింహులు గౌడ్, దంతూరి మైశా గౌడ్, శ్రీధర్ గౌడ్ ,మంగళి సాయికుమార్, బొడిగె భాను ప్రకాష్ గౌడ్, రోహిత్ గౌడ్, పసుపు సాయిలు, బొడిగె సందీప్ గౌడ్, భోధనం సాయిలు, రాఘవ, నార్లవార్ రాము, అల్లం సాయిలు, భక్తులు,గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india