V1News Telangana

best news portal development company in india

లయోలా పాఠశాల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు భిక్ష కార్యక్రమం.. లయోలా పాఠశాల లో స్వాములకు భిక్ష, భక్తుల భజనలతో హనుమాన్ సేవ.. ఆరాధనతో పాటు అన్నదాన సేవ – లయోలా పాఠశాల ప్రత్యేక కార్యక్రమం.. హనుమాన్ భక్తులకు లయోలా పాఠశాల నుండే భక్తి కానుక.

SHARE:

బోధన్, ఏప్రిల్ 4: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల లయోలా పాఠశాల యాజమాన్యం శుక్రవారం నాడు హనుమాన్ స్వాములకు, భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించింది.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి గీతాలతో భజనలు చేస్తూ ఆంజనేయ స్వామిని ఆరాధించారు. అనంతరం హనుమాన్ భక్తులందరికీ అన్నప్రసాద బిక్షను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్, తస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ మోడల్ పాఠశాలల వ్యవస్థాపకుడు కొడాలి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల సిబ్బంది, స్థానిక హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భాన్ని భక్తులు ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికతతో ఆస్వాదించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india