బోధన్ టిటిడి కళ్యాణ మండపంలో రామనవమి శాంతి కమిటీ సమావేశం..
బోధన్: రాబోయే శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో బోధన్ టిటిడి కళ్యాణ మండపంలో శాంతి కమిటీ సమావేశం
జరిగింది. ఈ సమావేశానికి ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు సంయుక్తంగా అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏప్రిల్ 6న జరగబోయే రాముని కళ్యాణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీజేలు, శబ్ద ప్రయోగాలు నిషేధించబడినట్లు తెలియజేశారు. సున్నితమైన సన్నాయి చప్పుళ్లు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.టౌన్ సీఐ వెంకట నారాయణ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలో రామనవమిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, ఏవైనా అవాంఛనీయ చర్యలు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ, పండుగలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొని విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బోధన్ శక్కర్ నగర్, ఎడపల్లి, రెంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








