రాంపూర్, నిర్మల్ జిల్లా:
నర్సాపూర్ (జి) మండలంలోని రాంపూర్ గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి, నిర్మల్ ఏఎంసీ డైరెక్టర్ అజీమ్, మాజీ ఎంపీటీసీ రవి, ఉమామహేశ్వర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. భారత రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరించడంతో పాటు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన పెంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించేలా ప్రజలను ప్రేరేపించేందుకు నేతలు కృషి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








