సారంగాపూర్ మండలంలో “జై బాపు జై బీమ్ జై సంవిధాన్” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ రోజు బీరెల్లి, ప్యారమూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ గారు నడిపించారు.
కార్యక్రమంలో సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భొజ్జటి నర్సయ్య, తాజా మాజీ జిల్లా పరిషత్తు మెంబర్ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మండల మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి, వారి ఆశయాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యాలు వివరించారు.
- గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ సమాజహితం కోసం కాంగ్రెస్ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమం ప్రశంసనీయం కాగా, గ్రామస్తుల నుండి మంచి స్పందన వచ్చింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








