V1News Telangana

best news portal development company in india

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు….

SHARE:

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు గ్రామానికి చెందిన నాయకులు అందరూ కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320, కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లబ్ధి పొందాలని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతులకు సన్న రకం ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్ కు రూ.500 బోనస్ ను కూడా అమలు చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, పిఎసిఎస్ చైర్మన్ గంగారం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముస్త్యాల శ్రీధర్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, అయినాల లింగం, కూని మహేందర్ గౌడ్, చుంచు పెద్ద సాయిలు, మోసిన్, గూళ్ళ సాయిలు, అల్లం సాయిలు, చుంచు వెంకన్న, కోదండ రామారావ్ ,అరిగె పోచయ్య, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india