భైంసా: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ, “హిందూ వాహిని హిందువుల కష్టకాలంలో అండగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.అనిత బాలాజీ సూత్రావే మాట్లాడుతూ, హిందూ వాహిని కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ సహాయంగా ఉంటానని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు.శాస్త్రీయంగా, ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని, ఇది వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని కార్యక్రమంలో తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనంగా ఉండే ఈ పచ్చడి మన జీవితంలోని అన్ని స్థితిగతులను తట్టుకునేలా చేస్తుందని పేర్కొన్నారు.ఈ వేడుకలో హిందూ వాహిని కార్యకర్తలు, బిజెపి నాయకులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








