V1News Telangana

best news portal development company in india

ఈద్గా మరియు మసీద్ లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.. బోధన్ డివిజన్‌లో పోలీస్ కమిషనర్ పర్యటన – భద్రతా ఏర్పాట్లపై సమీక్ష…. రంజాన్ నిమిత్తం ఈద్గా పరిసరాల్లో పటిష్ట భద్రత – పోలీస్ కమిషనర్ సూచనలు… బోధన్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య… ముస్లింల ప్రధాన ప్రార్థనా స్థలాలను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్…

SHARE:

బోధన్ డివిజన్ లోని ఈద్గా లను మరియు మసీద్ లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్, మార్చి 30: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గా లు మరియు మసీద్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ, అధికారులకు పలు కీలక సూచనలు అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు బోధన్ టౌన్ PS పరిధిలోని నర్సి రోడ్ లో గల జద్దిద్ ఈద్గా ను పర్యవేక్షించారు. ఈద్గా పెద్దలతో సమావేశమై భద్రతా చర్యల గురించి చర్చించారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా:
🔹 300 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
🔹 పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తున్నారు.
🔹 సీసీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘా అమలు.
🔹 అత్యవసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ విధానం అమలులో ఉంది.
🔹 ప్రజలు పోలీసులకు సహకరించాలి అంటూ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా బోధన్ ఏ.సి.పి శ్రీ శ్రీనివాస్, ట్రాఫిక్ CIP శ్రీ చందర్ రాథోడ్, బోధన్ CIP శ్రీ వెంకటనారాయణ, ఎస్సైలు, ఈద్గా పెద్దలు శ్రీ మహమ్మద్ గానం, అలీమ్ రాజి, అస్సలామ్ ఇంజనీర్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india