V1News Telangana

best news portal development company in india

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ నాయకులు….

SHARE:

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు స్థానిక మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6:30 నిమిషాలకు పవిత్ర ప్రార్థనలు ముగించుకొని అనంతరం పళ్ళను స్వీకరించి ఉపవాస ధీక్షను విరమించారు. మతసామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇస్తారు విందులో ఒకరికొకరు ఆప్యాయంగా పళ్ళు తినిపించుకొని మనం దాన్ని వ్యక్తం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకుగాను టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్ , టేకుర్ల సాయిలు, మంగళి సాయి, మోసిన్, వెంకట్ , సాయిబాబా, దొంతి భాస్కర్ ,అల్లం రాములు, షఫీ, మోచే గణేష్, లక్ష్మణ్, ధార వెంకటి, శివసూరి, నరసింహులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india