Post Views: 182
బోధన్ పట్టణం: బోధన్ పట్టణంలోని 16వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శ్రీమతి పద్మ గారు మరియు వెంకట్ గారు సమాజ సేవలో ముందుండి నిరుపేద ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా రంజాన్ తోఫా అందజేశారు.
వ్యక్తిగత ఖర్చులతో, కులమతాలకు అతీతంగా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,“అందరూ కలిసి ప్రేమగా, సోదర భావంతో పండుగలను జరుపుకోవాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మొన్సప్, అప్సర్, హలీం తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు తోడ్పడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








