మంధర్న ఇసుక క్వారీపై దుష్ప్రచారం – గ్రామ రైతులు, కులీల ఆందోళన..
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మంధర్న గ్రామ రైతులు, కూలీలు తమ గ్రామంలో నడుస్తున్న ఇసుక క్వారీ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ స్పందించారు. ఈ క్వారీ గ్రామ అభివృద్ధికి, నిరుపేద రైతు, కులీల ఉపాధికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.మంజీర నదిలో ఇసుకను గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తమ పక్కన ఉన్న ప్రాంతాల్లో ఇసుక లేకపోవడంతో, మన ప్రాంతంలోకి వచ్చి తీసుకువెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండికొట్టడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తరువాత, ఈ సంవత్సరం మంధర్న గ్రామ శివారులో అధికారికంగా ఇసుక క్వారీని ప్రారంభించారు.గ్రామాభివృద్ధికి కీలకమైన ఇసుక ఆదాయం ఈ ఇసుక క్వారీ ద్వారా గ్రామ పంచాయతికి సీనరేజ్ ఛార్జ్ రూపంలో ఆదాయం లభిస్తోంది. ఇది గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, ఈ క్వారీ నడపడం వల్ల గ్రామ రైతులకు రోడ్డు సౌకర్యాలు మెరుగుపడటమే కాక, నిరుపేద కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇసుక నింపే పనుల ద్వారా వారికి రోజువారీ ఆదాయం అందుతోంది.
దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – గ్రామ ప్రజలు బోధన్ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి కానీ, ఇటీవల కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక క్వారీపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ, క్వారీ మూయించేందుకు ప్రయత్నిస్తున్నారని.. గ్రామస్థులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో మంధర్న గ్రామ రైతులు, కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం ఏమిటంటే, ఇట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా, గ్రామ అభివృద్ధి కోసం క్వారీలు కొనసాగేందుకు సహకరించాలని…
బోధన్ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. ఇసుక ఆదాయంతో గ్రామ అభివృద్ధి ముడిపడి ఉన్నందున, దీనిపై సానుకూలంగా స్పందించి సహకరించాలని వారు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








