V1News Telangana

best news portal development company in india

పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత

SHARE:

నిజామాబాద్: పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో RSIగా పనిచేసిన కీ॥ శే॥ సోలోమన్ గారు అనారోగ్యంతో 02-12-2024న మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో భద్రత ఎక్స్ గ్రేషియా పథకం కింద రూ.16 లక్షల రూపాయల చెక్కును నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ గారు సోలోమన్ కుమారుడు అస్క కిరణ్ రాజ్ గారికి అందజేశారు..

.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వారెడ్డి, ఏ.ఓ అనిసాబేగం, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీ తిరుపతి (అడ్మిన్/MTO), శ్రీ శ్రీనివాస్ (వెల్ఫేర్), శ్రీ సతీష్ (హోమ్ గార్డ్స్), పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ షకీల్ పాషా, డిపిఒ సీనియర్ అసిస్టెంట్ శ్రీ పి. రాజేశ్వర్, అలాగే సోలోమన్ గారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మృతి చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని అందజేయడం తమ బాధ్యత అని అన్నారు. పోలీస్ శాఖ ఎప్పటికీ తమ కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india