నిజామాబాద్, మార్చి 28:
నిజామాబాద్ నగరంలో రంజాన్ మాసం చివరి శుక్రవారం (జుమ్మాత్తుల్ విధా) సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. పరిశీలించారు. ఈ రోజు నగరంలోని కచ్చియా మసీద్ ప్రాంతంలో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్నారు.
అలాంటి కార్యక్రమాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా నిర్వహించేందుకు కమిషనర్ అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా ప్రాంతాల్లో ఫుట్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పరస్పర సహకారం, సోదరభావంతో మెలిగి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏ.సి.పి శ్రీ రాజ వెంకట్ రెడ్డి, టౌన్ SHO రఘుపతి, ట్రాఫిక్ CI ప్రసాద్, ఎస్.ఐలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








