ఇసుక మాఫియాతో అక్రమ లావాదేవీలు – చిరుత దత్తుపై ఆరోపణలు…
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కోడిచెర్ల మంజీరా సరిహద్దు ప్రాంతంలో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు, చిరుత దత్తు అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం ఇసుక మాఫియా దారుల నుంచి 30 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై స్థానికులు బోధన్ సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనేక ఏళ్లుగా ఇదే విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు సమాచారం అందించడంతో, ఈ అంశంపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్ అశోక్‌ను కోరినట్టు సమాచారం.ఇసుక మాఫియా కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారా? గ్రామస్థుల ఆరోపణలు ఎంతవరకు నిజం? విచారణ అనంతరం న్యాయపరమైన చర్యలు ఉంటాయా? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








