V1News Telangana

best news portal development company in india

సాలూరులో ముగిసింది – సాలంపాడులో వెలిసింది! . పేకాట మాఫియాకు ? ప్రజల ఆగ్రహం! . పంట పొలాల్లో పేకాట . నిజామాబాద్‌లో పేకాట రాజ్యం – ప్రజల డిమాండ్: తక్షణ చర్యలు తీసుకోండి! అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు!

SHARE:

నిజామాబాద్ జిల్లా:
సాలురా మండలంలోని సాలంపాడు గ్రామ శివారులో రైస్ మిల్ పక్కన పంట పొలాలలో పేకాట మాఫియా అడ్డాగా మారింది. నాగంపల్లి, కొమ్మన్పల్లి పరిసరాల్లో పంట పొలాలను కేంద్రంగా చేసుకుని పేకాట నిర్వాహకులు అడ్డుగోలుగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అధికారుల మౌనమే వెనుక అండగా?
పేకాట నిర్వహణలో కీలక వ్యక్తులు, “మేము దర్జాగా నడుపుతాము, మాకు ఎవరు ఏమి చేయలేరు. అధికారుల మద్దతుతోనే ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి,” అంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది.
సాయంత్రం నుంచి రాత్రి వరకు సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు..
ప్రతి రోజు సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పేకాట కొనసాగుతున్నా, ఎటువంటి చర్యలూ కనిపించడం లేదు.
ప్రజల డిమాండ్ – వెంటనే చర్యలు తీసుకోవాలి!స్థానికులు ఈ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు, సంబంధిత శాఖలు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india