V1News Telangana

best news portal development company in india

ఆందపూర్ ZP హైస్కూల్‌ను సందర్శించిన బోధన్ సబ్-కలెక్టర్… మధ్యంతర పరీక్షల్లో తక్కువ మార్కులు పొందిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – సబ్-కలెక్టర్ సూచన… . అంతిమ పరీక్ష సమీక్షలో బోధన్ సబ్-కలెక్టర్ సూచనలు…. విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అవసరం – సబ్-కలెక్టర్…

SHARE:

బోధన్ మండలంలోని.ఆందపూర్ గ్రామం Zilla Parishad హైస్కూల్‌ను బోధన్ సబ్-కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల కోసం నిర్వహించిన ఎండ్-లైన్ పరీక్షను సమీక్షించేందుకు ఈ పర్యటన జరిగింది.

ఈ సందర్బంగా, ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మధ్యంతర పరీక్షల్లో తక్కువ మార్కులు పొందిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. వారి ప్రగతిని మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు అధిక శ్రమ వహించాలని సూచించారు.

ఇలాంటి పరీక్షల సమీక్ష ద్వారా విద్యార్థుల సామర్థ్యం పెంపొందించేందుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు ఈ రకమైన పర్యవేక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india