V1News Telangana

best news portal development company in india

ప్రముఖ రసాయన శాస్త్రవేత్త జాదవ్ బలవంత్ రావు పటేల్ గారి ఔదార్యం మంజరి పాఠశాలకు ప్రింటర్ విరాళంగా అందజేత

SHARE:

కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ విశ్లేషణాత్మక రసాయన శాస్త్రవేత్త, అమెరికాలో స్థిరపడ్డ శ్రీ జాదవ్ బలవంత్ రావు పటేల్ గారు తన కుమార్తె జన్మదినం సందర్భంగా మంజరి ప్రాథమిక పాఠశాల (MPPS Manjri) కు రూ. 20,000 విలువైన ప్రింటర్‌ను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయగా, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ షిందే ఆనంద్ రావు పటేల్, మాధవ్ రావు, రామ్ పటేల్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దాతృత్వం పాఠశాల అభివృద్ధికి దోహదపడుతుందంటూ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india