బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆశా వర్కర్లు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. నిన్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేసిన ఘటనకు వ్యతిరేకంగా, వారు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు J శంకర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, 16 నెలలు గడిచినా అమలు చేయకపోవడం తగదని విమర్శించారు. సంవత్సరానికి పైగా వేచి చూసిన అనంతరం, తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆశా వర్కర్లు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నడుం బిగించారని చెప్పారు.
అయితే, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వమూ ఉద్యమాలను అణచివేయడానికి అరెస్టులను ఉపయోగించడం సరైంది కాదని శంకర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. నిరసనలు, ఉద్యమాలను అరెస్టులతో నిలువరించలేరని హెచ్చరిస్తూ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
ఇక మరోవైపు, మోదీ ప్రభుత్వం మహిళా కార్మికుల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో NPRD జిల్లా కార్యదర్శి Y గంగాధర్ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు:
దివ్య, విజయ, సుజాత, అనిత, బాలహంస, యాస్మిన్, జాకీరా, సమీనా మరియు ఇతరులు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








