V1News Telangana

best news portal development company in india

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దమన కాండ కు వ్యతిరేకంగా భైంసా పట్టణం లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్లు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

SHARE:

*ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దమన కాండ కు వ్యతిరేకంగా
భైంసా పట్టణం లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్లు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.


దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు హజరై మాట్లాడారు.
ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతి యుత పోరాటం చేస్తుంటే మహిళ ఉద్యోగులని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్ళను ఇడ్చు కుంటూ అరెస్టులు చేశారు. అంతకు ఒక రోజు ముందు ఆశలను ముందస్తు హౌస్ అరెస్ట్ లు చేయడం ఎంత వరకు సమాంజసం అని ప్రశ్నించడం జరిగింది.
గతంలో రేవంత్ రెడ్డి ఇదే ఆశలు పోరాటం చేస్తే వారి టెంట్ కిందకు వెళ్లి అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా రోడ్డు పాలు చేసారు. కనీసం వినతి పత్రం తీసుకునే పరిస్థితి లో లేరు.
అతి తక్కువ పారితోశకంతో పని చేస్తూ ఆరోగ్య శాఖ లో కీలక పాత్ర వహిస్తున్న పట్టించుకోక పోవడం చాలా దారుణం. కాబట్టి వెంటనే ఆశ వర్కర్స్ కు ఫిక్సిడ్ వేతనం 18000 ఇవ్వాలని, పిఎఫ్, ఇ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల భవిష్యత్తు లో జరగ బోయే పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు నిస్తుందని తెలియచేస్తున్నాం.
ఈ కార్యక్రమం లో ఆశ వర్కర్స్ మండల అధ్యక్షురాలు మారకంటి విజయ, లక్ష్మి,భైంసా పట్టణ అధ్యక్షురాలు మౌనిక, ఉజ్వల తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india