V1News Telangana

best news portal development company in india

బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిజెపి యువ నేత….

SHARE:

– పలు సేవా కార్యక్రమాలతో దాతృత్వాన్ని చాటుకుంటున్న వైనం

– బిజెపి కార్యకర్తలకు స్వంత ఖర్చులతో రూ.15 లక్షల ప్రమాద భీమా వర్తించే విధంగా భద్రతా కల్పన

– పార్టీ ఎదుగుదల కొరకు ఎల్లప్పుడు కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా

– క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపు

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి యువ నేత, NRI కోనేరు శశాంక్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బిజెపి పార్టీ కార్యకర్తలకు తన సొంత ఖర్చులతో రూ. 15 లక్షల ప్రమాద భీమా వర్తించే విధంగా వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తూ పాలసీలను చేయించారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ బిజెపి పార్టీ కొరకు రాత్రనక, పగలనక ఎల్లవేళలా పనిచేస్తున్న కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా మంచి ఆలోచనతో భీమా లను చేయిస్తున్నానని అన్నారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక బిజెపి కార్యకర్త, అదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కాలు కోల్పోయిన వారిని తలచుకుని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన కార్యకర్త కుటుంబం మరియు గాయాల పాలైన కార్యకర్త కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేశారు. అదే సందర్భంలో తన మనసులో ఈ ఆలోచన కలిగిందని అందువల్ల ప్రతి కార్యకర్తకు విపత్కర పరిస్థితులలో ప్రమాద భీమా వర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని తెలిపారు. భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో గల 9 మండలాలలో ప్రతి మండల కేంద్రంలో ఒకరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. కార్యకర్తలందరూ సమిష్టిగా, ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యకర్తల యోగ క్షేమాలను దృష్టిలో ఉంచుకొని.. ఇప్పటివరకు ఏ నాయకులు కూడా ఈ విధంగా ప్రమాద భీమా భరోసాను కల్పించలేదని స్థానిక నాయకులు అన్నారు.. ప్రమాద భీమా సౌకర్యం కల్పించి నేనున్నానని అండగా నిలిచిన NRI కోనేరు శశాంక్ కు కార్యకర్తలందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, బాన్సువాడ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్,రుద్రూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, పాయల్ శంకర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india