. బోధన్‌లో కలకలం: ఆర్ఐ గంగాధర్ ఆడియో టేపులు వైరల్!
. సబ్ కలెక్టర్ వికాస్ మహతో దృష్టికి… ఆర్ఐ గంగాధర్‌కు కాస్ట్ నోటీసు!
సమాచార హక్కు అధికారిపై చర్యలు తప్పవా? బోధన్‌లో ఉత్కంఠ
. త్వరలో మీడియా సమావేశం… గంగాధర్‌పై ఎలాంటి చర్యలు?
. సమాజ మాధ్యమాల్లో హల్చల్ చేసిన ఆడియో టేపులు… అధికారుల సీరియస్ రియాక్షన్!
బోధన్ పట్టణంలో ఇటీవల ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) గంగాధర్ కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో మరియు పత్రికలలో వైరల్ కావడంతో, ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ అంశంపై సబ్ కలెక్టర్ వికాస్ మహతో తీవ్రంగా స్పందించారు.
సమాచారాన్ని పరిశీలించిన అనంతరం, అధికార దుర్వినియోగం లేదా అవినీతి ఆరోపణలపై స్పష్టత తెచ్చుకునేందుకు, ఆర్ఐ గంగాధర్‌కు కాస్ట్ నోటీసు జారీ చేసినట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. ఈ నోటీసులో ఆయన్ని వివరణ కోరారు మరియు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తదుపరి చర్యలు ఏవిధంగా ఉంటాయో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి బోధన్ ప్రజలు, స్థానిక నాయకులు, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆడియో టేపుల్లో ఉన్న విషయం పై అధికారుల విచారణ ప్రారంభమైంది. ఆర్ఐ గంగాధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయనపై ఉన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? అనే విషయాలపై అధికారిక ప్రకటన కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








