V1News Telangana

best news portal development company in india

అర్లీకే గ్రామంలో పంట పొలాల రహదారి అభివృద్ధికి మంజూరు

SHARE:

అర్లీకే గ్రామంలో పంట పొలాల రహదారి అభివృద్ధికి మంజూరు

నిర్మల్: నర్సాపూర్ మండలంలోని అర్లీకే గ్రామ పంట పొలాలకు రహదారి సరిగ్గా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి గారికి గ్రామస్థులు విన్నవించగా, ఆయన ఈ విషయాన్ని నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గౌరవనీయురాలు సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో స్పందించిన మంత్రి సీతక్క గారు, రహదారి అభివృద్ధికి సుమారు రెండు లక్షల రూపాయల మొరం రోడ్డు మంజూరు చేయించారు. ఈ నిధులను మంజూరు చేయించినందుకు గ్రామస్తులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క గారు, మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ డైరెక్టర్ చందాల మురళి, భోజన్న, ప్రభాకర్, ప్రవీణ్, మగ్గిడి భోజన్న, సాయినాథ్, గంగప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india