జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని అసాంక్రమిక వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో గ్రామ మరియు ఆరోగ్య ఉపకేంద్రస్థాయిలో నిర్వహిస్తున్న అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను చేయాల్సిన టార్గెట్ కంటే తక్కువ చేసిన ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బంది ఏఎన్ఎం ఎమ్మెల్ హెచ్ పీ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం గారు సమీక్ష నిర్వహించారు. ఎవరైతే ఎన్ సి డి స్క్రీనింగ్ లో తక్కువ స్క్రీనింగ్ చేసి ఎక్కువ పెండింగ్ ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బంది అందరూ ఈనెల మార్చి ఆఖరి వరకు పూర్తి చేయాలని లేనిచో వారందరికీ మెమొలు జారీ చేయడం జరుగుతుందని సిబ్బందిని హెచ్చరించారు. అదేవిధంగా ఆరోగ్య ఉపకేంద్రస్థాయిలో మరియు పిహెచ్సి స్థాయిలో అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరిగే తీరును ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా సమీక్షించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో అందరి నీ సమన్వయపరచుకుంటూ తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల ఎవరు కూడా వడదెబ్బకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వడదెబ్బకు అవసరమైన ఓ ఆర్ ఎస్ , ఐవీ ఫ్లూయిడ్స్, అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కూలీల పనివేళల్ని ఉదయం 6 గంటల నుండి 11 గంటలు లోపే ఉండేలా చూడాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, ఇన్ సిడి కోఆర్డినేటర్ పి.వెంకటేశం, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు,
హెచ్ ఈ ఓ నాగరాజు మరియు వివిధ ఆరోగ్య ఉప కేంద్రాల నుండి వచ్చిన ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








