జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీకాల ప్రణాళికపై కీలక శిక్షణ
. టీకాల మైక్రో యాక్షన్ ప్లాన్ – ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమగ్ర అమలు పై దృష్టి
. వ్యాధి నిరోధక టీకాల డ్రాప్ ఔట్లు లేకుండా చర్యలు – శిక్షణలో అధికారులు
. శిక్షణలో కీలక మార్గదర్శకాలు – వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్ చైన్ నిర్వహణ పై స్పష్టత
వ్యాధి నిరోధక టీకాల మైక్రో యాక్షన్ ప్లాన్ పై శిక్షణ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల మైక్రో యాక్షన్ ప్లాన్ అమలుపై పీహెచ్సీ రిపోర్టింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ హాజరై, ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో టీకాల ప్రణాళిక అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు.
వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన లబ్ధిదారుల జాబితాను ముందుగా సిద్ధం చేయడం, వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్ చైన్ మెయింటెన్స్, డ్రాప్ ఔట్లు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేట్ సర్వెలైన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అతుల్ నెగి శిక్షణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, పీహెచ్సీ అధికారులు, డీఐఓ సిబ్బంది పాల్గొన్నారు.
—
గుండెపోటుతో అకాల మరణం – వైద్యునికి నివాళి..
ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ఈరోజు గుండెపోటుతో మరణించిన డాక్టర్ శ్రీకాంత్ మృతికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863









