Post Views: 35
12 కిలోల గంజాయిని పట్టుకున్న ఎన్టిపిసి పోలీసులు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం / ఎన్ టి పి సి మార్చ్ 19:-
ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో తరలిస్తున్న 12 కిలోల గంజాయిని ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్ తన పోలీసు సిబ్బందితో బుధవారం సాయంత్రం ఎన్టిపిసి లేబర్ గేటు వద్ద పట్టుకుని కారులో తరలిస్తున్న 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టిపిసి పవర్ ప్లాంట్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న లేబర్ లకు గంజాయి అమ్మి మిగతాది తిరిగి ఇంటికి తీసుకు వెళుతుండగా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు కార్ ని తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి దొరికిందని పోలీసులు తెలిపారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM