V1News Telangana

best news portal development company in india

అక్రమ మొరం తవ్వకాలపై గ్రామస్తుల ఆగ్రహం! . అక్బర్ నగర్ శివారులో అనధికారిక తవ్వకాలు – అధికారుల మౌనం? హిందూ స్మశాన వాటిక స్థల కబ్జాపై గ్రామస్థుల ఆందోళన అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం – భవిష్యత్ తరాలకు ముప్పు పదేళ్లుగా విస్మృతమైన అభివృద్ధి – ఇప్పుడు అక్రమ తవ్వకాల ఆర్భాటం?

SHARE:

నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండానే, కొంత మంది గ్రామస్తులు అభివృద్ధి పేరుతో మొరాన్ని అమ్ముకుంటున్నారు. ఈ తవ్వకాలు మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు సమీపంలో జరుగుతుండటంతో భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

వర్షాకాలంలో ఈ తవ్వకాల కారణంగా గుంతలు ఏర్పడి, పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అయితే, ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కొంతమంది గ్రామస్తులు ప్రయత్నించగా, అంతటితో ఊరుకోకుండా వారిపై దాడికి కూడా ప్రయత్నించారని సమాచారం.

హిందూ స్మశాన వాటిక కోసం ఐదు ఎకరాల స్థలం కబ్జాకు ప్రణాళిక వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి జరగకపోతే, ఇప్పుడు అక్రమ తవ్వకాలతో అభివృద్ధి చాటుకోవడం ఏంత వరకు సమంజసం? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వీడీసీ (గ్రామ అభివృద్ధి కమిటీ) ఉన్నప్పటికీ, ఇంతవరకు అభివృద్ధి జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ ప్రజలు ఈ అక్రమ తవ్వకాలను మానివేయించి, ప్రకృతిని కాపాడాలని, భవిష్యత్ తరాలకు మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అధికార చర్యలు తీసుకుంటారో చూడాలి!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india