నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం మరియు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వీడ్కోలు కార్యక్రమాన్ని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పూజ కార్యక్రమంతో ప్రారంభించి, విద్యార్థులకు పాఠశాల అనంతర ఉన్నత విద్యామార్గదర్శకాన్ని అందించారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు బహుమతులు అందజేశారు.
అదే విధంగా, వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అలరించారు. ఛైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడలు, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని, సాంకేతిక మార్పులను అవగాహన చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. విద్యతో పాటు కళలకు ప్రాధాన్యత ఇచ్చి సమగ్రంగా ఎదగాలని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








