V1News Telangana

best news portal development company in india

శ్రీ చక్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు – రూ. 3 లక్షల 2 వేల ఆదాయం

SHARE:

బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం దేవాదాయ ధర్మదాయ శాఖ, ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా మొత్తం మూడు లక్షల 2 వేల 990 రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకురాలు కమలా బాయి, ఆలయ ఈవో రాములు, ఆలయ అధ్యక్షుడు హరికాంత్ చారి తెలిపారు.

మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక దర్శనం టోకెన్లు, స్టాల్స్ ద్వారా నాలుగు లక్షల 20 వేల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గణేష్ మహరాజ్, మహేష్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india