– అర్హుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఎందుకు..?
– పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయకపోతే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వృధా
– అనర్హులకే పథకం వర్తింపచేసిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఎటువంటి శిక్షలు అమలు చేస్తుందో తెలపాలి
– బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి& తెలుగు నాడు స్టూడెంట్ యూనియన్ పుట్ట భాస్కర్
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే “రాజీవ్ యువవికాసం” పథకాన్ని బీసీ సంఘం ద్వారా స్వాగతిస్తున్నామని మంగళవారం రోజు బాన్సువాడలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా నిజమైన అర్హులకే రుణాలను ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ వర్గాలలో ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి.. స్వయం ఉపాధి పొందడం కొరకు “రాజీవ్ యువ వికాసం” అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ అధికారాన్ని ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి తహసిల్దార్, ఎంపీడీవో లకు ఇవ్వాలని.. ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయకూడదని బీసీ సంఘం తరపున ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే గత ప్రభుత్వంపైన నిరుద్యోగులు వ్యతిరేకత చూపించారని.. వారి ఆగ్రహానికి గురై తద్వారా ప్రభుత్వం అధికారాన్ని కూడా కోల్పోయిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వమైనా అలాంటి తప్పులు పునరావృతం కానివ్వకుండా పకడ్బందీగా, కట్టుదిట్టమైన చర్యలు పాటిస్తూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. మళ్లీ ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరించినట్లయితే బహుజన నిరుద్యోగ యువకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజా ప్రతినిధుల ప్రమేయాన్ని తొలగించి ప్రభుత్వ అధికారులను మాత్రమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘం తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెంట సాయిలు,శ్రీకాంత్,నందు, సోమేశ్ ,నిఖిల్, బాలు,కొమ్ము సాయి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








