Post Views: 150
భైంసా మండలంలోని దేగం దత్తాత్రి ఆలయ అభివృద్ధి పనులను ఈ రోజు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన రహదారి, ఆలయ షెడ్, గోడలు వంటి అభివృద్ధి పనులను పరిశీలించి, నాణ్యత లోపం ఉండకూడదని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి బాబూరావు మరియు కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఇంకా నిధుల అవసరం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చేంధ్రే, ముత్యం రెడ్డి, రామచంద్ర రెడ్డి, చంద్రకాంత్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








