V1News Telangana

best news portal development company in india

వివిధ వర్ణాల శోభితం హోలీ పండుగ వైభవం….

SHARE:

– ఉత్సాహంగా హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

– మండల ప్రజలకు పండగ శుభాకాంక్షలు

– కనుమరుగవుతున్న పండగల ప్రాధాన్యత పట్ల అసంతృప్తి వ్యక్తం

– సంస్కృతి, సాంప్రదాయాలను, పండగల వైభవాన్ని అందరూ కాపాడాలని విజ్ఞప్తి

– బిజెపి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు

ననురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల వ్యాప్తంగా గల వివిధ గ్రామాలలో శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అందరూ కలిసి హోలీ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం రోజు అర్ధరాత్రి అనాదిగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం గ్రామ పెద్దలు కామ దహనాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పిల్లలు, యువకులు, పెద్దలు, మహిళలు అందరితో కలిసి రాజకీయాలకు అతీతంగా ఉత్సాహంగా వీధులలో ఒకరిపై ఒకరు పరస్పరం రంగులు చల్లుకుంటూ అందరిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు హోలీ పండుగను చాలా బాగా జరుపుకునే వారిమని తెలిపారు. కాలక్రమంలో పండగల యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. మళ్లీ మన పండగలకు పూర్వ వైభవం రావాలంటే ప్రతి ఒక్కరూ సంఘటితంగా, చైతన్యవంతంగా సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పండుగలను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టుకొని ఆత్మీయంగా ఆలింగణం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యువకులు డప్పు చప్పుళ్ళు మరియు డీజే లు ఏర్పాటు చేసుకుని ఆనందంగా, కేరింతలు కొడుతూ డ్యాన్సులతో అలరించారు. పండగ సందర్భంగా గ్రామాలలోని వీధులన్నీ రంగులతో నిండిపోయి దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ,NRI కోనేరు శశాంక్, అరిగె నారాయణ, కంది పెద్ద మల్లేష్, భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india