V1News Telangana

best news portal development company in india

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి….

SHARE:

– తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరుల ఆత్మబలి దానాలకు ప్రతీక

– పాలకుల నిర్లక్ష్యం వల్ల మరమ్మత్తులకు నోచుకోని అమరవీరుల స్తూపం

– మరమ్మత్తులు చేయించి మాట నిలబెట్టుకున్న బిజెపి నాయకులు

– వారి త్యాగాలకు సరైన గుర్తింపు దక్కకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం

– ప్రజల గుండెల్లో అమరవీరులను చిరస్థాయిగా నిలుపుకోవాలని విజ్ఞప్తి

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ,NRI కోనేరు శశాంక్ హాజరై అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు కార్లు మరియు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా NRI కోనేరు శశాంక్ మాట్లాడుతూ అమరవీరుల స్థూపాన్ని మరమ్మత్తులు చేయించే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.ఎందరో అమరవీరులు వారి ప్రాణాలను త్యాగం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. అలాంటి అమరవీరుల స్థూపం ధ్వంసమైనప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మొదటిసారి బాన్సువాడ పట్టణంలో పర్యటించినప్పుడు అమరవీరుల స్థూపం ధ్వంసమై అంధ వికారంగా ఉన్న దృశ్యాన్ని చూసి గుండెచలించిపోయిందని తెలిపారు. స్థానిక నాయకులు అమరవీరుల స్తూపాన్ని మరమ్మత్తులు చేయించాలని తన దృష్టికి తీసుకురావడంతో ఆరోజు వాగ్దానం చేశానని గుర్తు చేశారు.ఇచ్చిన మాట ప్రకారం అమరవీరుల స్థూపాన్ని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం పట్ల గర్వపడుతున్నానని తెలియజేశారు. అమరవీరుల త్యాగాలు వెళ కట్టలేనివని అభివర్ణించారు. కనీసం ప్రజలు గుండెల్లో అమరవీరుల త్యాగాలను చిరస్థాయిగా నిలిచిపోయేలా గుర్తుంచుకోవాలని కోరారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india