V1News Telangana

best news portal development company in india

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం – BRS నేత రవీందర్ యాదవ్… కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – BRS, బీజేపీ నేతల డిమాండ్.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వం స్పందించాలి… కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

SHARE:

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులను అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన ఘటనపై BRS పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బేషరతుగా అరెస్టయిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు..

.ఈ ఉదయం కార్మికులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని, వేతన బకాయిలను విడుదల చేయాలని కోరారు.కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీ నేతలు అడ్లూరి శ్రీనివాస్, రామరాజు, పేరక వెంకటేష్ కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కార్మికుల విడుదల కోసం ప్రయత్నించారు.
BRS మరియు బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india