జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ
నిజామాబాద్: ఇటీవల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షలలో దృష్టిలోపం ఉన్న పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కంటి అద్దాల పంపిణీకి ముందుకొచ్చింది. మొదటి విడతలో భాగంగా 1277 కంటి అద్దాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అందించగా, వాటిని వివిధ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ గారు, కంజార్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ (బాలికల) పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్.బి.ఎస్.కె (RBSK) బృందాల ద్వారా జిల్లావ్యాప్తంగా కంటి అద్దాల పంపిణీ నిరంతరంగా జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, మేనేజర్ సచిన్, వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ సందీప్, ఇతర అధికారులు కరీం, సంధ్య, నర్సవ్వ, రఘుపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉచితంగా కంటి అద్దాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








