భైంసా, నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ పరిధిలోని పలు బాధితులకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరవ నియులు శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ గారు ఈ రోజు భైంసా టౌన్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూ. 4.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చేంధ్రే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, మాజీ ఎంపీపీలు రామచంద్ర రెడ్డి, చంద్రకాంత్, బోజారం పటేల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, బాధిత కుటుంబాలకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భోస్లే నారాయణ్ రావు పటేల్ గారు అన్నారు. అలాగే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








