V1News Telangana

best news portal development company in india

భైంసా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం – 100 ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేతపై కాలనీవాసుల ఆగ్రహం

SHARE:

భైంసా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం – 100 ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేతపై కాలనీవాసుల ఆగ్రహం

భైంసా పట్టణంలోని మున్సిపల్ వార్డ్ నెంబర్ 7 బుద్ధ విహార్ దళిత కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగుచూసింది. కేవలం ఇద్దరు ఇంటి పన్ను చెల్లించలేదన్న కారణంతో, ఆ కాలనీలోని 100 ఇళ్లకు నీటి సరఫరాను నిలిపివేస్తూ మున్సిపల్ కమిషనర్ అన్యాయ నిర్ణయం తీసుకున్నారు.

కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్ట్రిషన్ వచ్చి బోరు మోటార్ స్టార్టర్‌ను తీసుకెళ్లడం వల్ల కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో, తమ నిరసనను వ్యక్తం చేస్తూ అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, కాలనీవాసులే స్వయంగా కొత్త స్టార్టర్‌ను కొనుగోలు చేసి బోరు మోటార్‌ను తిరిగి అమర్చారు.

10 ఏళ్లుగా కనీస వసతులు లేవు

కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, గత 10 ఏళ్లుగా వార్డ్ నం. 7లో కనీస వసతులైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, సరైన లైట్లు లేవు. మురికి కాలువలు పారక కాలనీవాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్లు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా అవతల పడుతున్నారు.

స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం – కాలనీవాసుల హెచ్చరిక

ఈ అన్యాయ నిర్ణయాలపై స్పందించకపోతే భారీ స్థాయిలో ధర్నా చేపట్టి, కలెక్టరేట్ ముట్టడిస్తామని బుద్ధ విహార్ కాలనీవాసులు హెచ్చరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భైంసా మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి, కాలనీవాసులకు ప్రాథమిక వసతులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india