V1News Telangana

best news portal development company in india

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* *నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి* *మాజీ MLC ఆకుల లలిత*

SHARE:

*మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*

*నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి*

*మాజీ MLC ఆకుల లలిత

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ జిల్లా మరియు నగర మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి రంగంలో మహిళలకు సమాన న్యాయం కల్పించినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించిందని మహిళల కొరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. మన దేశంలో మహిళలకు ఎంతో గొప్ప ప్రాధాన్యత వుంది అని, మహిళలు ముందుకు వచ్చి ప్రతి రంగం లో తమ సత్తా చూపాలని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంఎల్సి ఆకుల లలిత మాట్లాడుతూ మహిళలు ప్రతిరంగంలో ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రాధాన్యత వల్లనే ఈరోజు మహిళలకు గుర్తింపు లభించింది అని ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కొరకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని ఆమె అన్నారు. మహిళలు తమలోని భయాన్ని వదిలి సమాజంలోకి వచ్చి ప్రతి రంగంలో తమ యొక్క ఆలోచనలను ముందుంచినప్పుడే దేశ అభివృద్ధి అనేది జరుగుతుందని ఈ సందర్భంగా మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, ఆశాబీ,గాజుల సుజాత,మలైకా బేగం,విజయ రాణి,అపర్ణ,మీనా మరియు తదితరులు పాల్గొన్నారు

కృతజ్ఞతలతో
యాస్.లక్ష్మణ్
పి.ఆర్. ఓ జిల్లా కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india