V1News Telangana

best news portal development company in india

తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల

SHARE:

*BREAKING*

తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా నష్టపోతున్న మహిళలు

 

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు

 

మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాన వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారు

 

జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదు ?

 

త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారు

 

ప్రతీ మహిళకు రూ 2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం

 

మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి

 

అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదు

 

మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహీర్గతం చేయాలి

 

కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు

 

మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు

 

కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది

 

కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు

 

అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉంది

 

సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం

 

ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది

 

అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది

 

చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం

 

మహిళలకు కులమతాలు లేవు.. మహిళలది ఒకే కులం

 

మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి

 

ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలి

 

అమెరికా 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్ లో మాత్రం అది 17 శాతంగానే ఉంది

 

దేశంలో 50 శాతం మహిళలు ఉద్యగాలు చేస్తే దేశ జీడీపీకి మనం 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతాం

 

కానీ మహిళలు ఉద్యోగాలు చేయదగడానికి గల సౌకర్యాలు ఉన్నాయా ? అన్నది ఆలోచించాలి

 

భూగర్భ గనులల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారు

 

అయినా అనేక అవాంతరాలు ఉన్నాయి… వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india