V1News Telangana

best news portal development company in india

మహిళలు పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలి….

SHARE:

– న్యాయమూర్తిని ఘనంగా సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు

– మహిళా సాధికారత దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలి

– మహిళలందరూ విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని జీవించాలని సూచనల

– బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు బాన్సువాడ పట్టణంలో గల కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో సివిల్ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి కి పుష్పగుచ్చం అందించారు. ఘనంగా శాలూవాతో సత్కరించి ఆమెతో పాటు మగువలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయమూర్తి మహిళ అయినప్పటికీ ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ స్త్రీ జాతికి మార్గదర్శకంగా నిలవడం పట్ల వారు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళల యొక్క ప్రాధాన్యతను, త్యాగాలను గుర్తిస్తూ, వారిని అభినందించే విధంగా ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక పురుషుడి విజయం వెనుక తల్లి, చెల్లి, అక్క, కూతురు ,భార్య.. ఇలా ఏదో ఒక రూపంలో స్త్రీమూర్తులు కొలువై ఉంటారని అన్నారు. వారి త్యాగాలను గుర్తిస్తూ, వారి శక్తిని వింతలు చేసేలా సమాజంలో ప్రతి ఒక్కరు మహిళలను గౌరవిస్తూ సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ బాల్య వివాహాలు, పసికందులపై అమానుషంగా జరుగుతున్న దాడులు , మహిళలను అవమానించడం పట్ల అసహనం వ్యక్తం నేటి సమాజంలో మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాలలో రాణించడం గర్వకారణమని మహిళలందరూ విపత్కర పరిస్థితులలో ఆత్మ న్యూనతకు గురికాకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని జీవించాలని ఆకాంక్షించారు. మహిళలు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, కలలను సహకారం చేసుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసిస్తూ సాటి మహిళలను సంఘటితం చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చదువుతోనే సమాజంలో అందరికీ గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలిపారు. మహిళా సాధికారత దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రమాకాంత్ రావ్, భూషణ్ రెడ్డి,మోహన్ రెడ్డి, ఖలీల్, హైమద్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india