– తెలంగాణ తిరుమల దేవస్థానంలో కన్నుల పండుగగా నిర్వహణ
– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
– ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో గల “తెలంగాణ తిరుమల దేవస్థానం” శ్రీ లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గురువారం రోజు సతీసమేతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి – పుష్ప దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు.పోచారం శంభురెడ్డి- ప్రేమల, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం నుంది శ్రీ శ్రీ శ్రీ దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారిచే తీర్థ గోష్ఠి, శాంతి పాఠము, ద్వార తోరణ పూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహావనం, పూర్ణాహుతి అనంతరం మాడవీధుల్లో హంస వాహనంపై స్వామి వారిని ఊరేగించారు.సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అనంతరం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా స్వామి వారి రథోత్సవం నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








