V1News Telangana

best news portal development company in india

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు….

SHARE:

– అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి, ఓదార్పు

– ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి సహకారం అందే విధంగా చూస్తామని హామీ

– యువజన నాయకులు మియాపురం శశికాంత్

బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదం వలన మూడు ఇల్లు కాలి బూడిదవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నిరుపేదలు అయిన పిడుగు శాంతవ్వ, సాయవ్వ, గంగామణి లను గురువారం రోజు యువజన నాయకులు మియాపురం శశికాంత్ కార్యకర్తలతో కలిసి వెళ్లి వారిని పరామర్శించి ఓదార్చారు. అనంతరం వారికి రూ.6 వేలు ఆర్థిక సహాయం అందించారు. విషయాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు పోచారం భాస్కర్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సందీప్ పాటిల్, కొరిమె రఘు, పృథ్వి, శ్రీకాంత్, ప్రశాంత్, బస్వంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india