V1News Telangana

best news portal development company in india

*వరుస కథనాలతో స్పందించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ*

SHARE:

కొన్ని రోజులుగా మీడియా కథనాలలో వస్తున్న వార్తలకు స్పందించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారులు పలు మండలాలలో.. విస్తృత తనిఖీలను చేపట్టారు.. ఇందులో భాగంగా ఇందల్వాయి మండలంలోని ధరణి శ్రీ ఆసుపత్రిలో మంగళవారం తనిఖీలను చేపట్టారు…
అత్యవసర విభాగాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు పొందలేదని, కేవలం అక్కడ పనిచేస్తున్న ఎంబిబిఎస్ డాక్టర్ పత్రాలతో పాటు ల్యాబ్ కి సంబంధించి అనుమతులు పొందారని విశ్వసనీయ సమాచారం…
ఇది ఒక విధంగా ఉంటే మరి ఎక్స్రే విభాగానికి సంబంధించిన టెక్నీషియన్, ఐసీయూ, మెడికల్ షాప్ కు సంబంధించిన ఫార్మసిస్ట్ కూడా అక్కడ లేరని తెలిసింది…
గత రెండు సంవత్సరాలుగా అన్ని కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తామంటూ సామాన్య ప్రజల ఆరోగ్యంతో ధరణి శ్రీ ఆసుపత్రి చెలగాటం ఆడింది… అక్కడ పనిచేస్తున్న విష్ణు కుమార్ డాక్టర్ ఉక్రెయిన్ దేశంలో ఎండి మెడిసిన్,చదివి ఇండియాకు సంబంధించి ఎంబిబిఎస్ అని బోర్డు పెట్టుకోవాలి, కానీ విష్ణుకుమార్ డాక్టర్ ఎండి అని పెట్టుకోవడం తన తప్పేనని అధికారుల ముందు ఒప్పుకోవడం జరిగిందని తెలిసింది, సంబంధిత అధికారులు ఆసుపత్రి పై
ఏ సమయానికైనా తనిఖీకి రావచ్చని తెలుసుకున్న
ధరణిశ్రీ ఆసుపత్రి యాజమాన్యం తమ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి సేవలను అందిస్తామంటూ పెట్టుకున్న పెద్దపెద్ద అడ్వటైజ్మెంట్ బోర్డులను తొలగించడం వెనుక కారణం ఏంటో హాస్పిటల్ యాజమాన్యమే చెప్పాలి… తమ వద్ద అన్ని విభాగాలకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పిన విష్ణుకుమార్ డాక్టర్ ఇప్పటివరకు ఎందుకు చూపించడం లేదో సామాన్య ప్రజలు అడుగుతున్నారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india