V1News Telangana

best news portal development company in india

ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరదబట్టు వేణు రాజ్ . విద్యార్థుల కోసం నా కృషి కొనసాగుతుంది – వేణు రాజ్ ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కమిటీలో వరదబట్టు వేణు రాజ్‌కు కీలక బాధ్యత విద్యార్థి సంక్షేమానికి నిధర్శనంగా నూతన బాధ్యతలు – వేణు రాజ్ రాష్ట్ర స్థాయిలో నూతన పాత్రలోకి నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ నేత

SHARE:

ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరదబట్టు వేణు రాజ్ గారు నియామకం కావడం జరిగింది. ప్రస్తుతం వేణు రాజ్ గారు ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు .

ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కమిటీలో నియామకమైన సందర్భంగా వరదబట్టు వేణు రాజ్ గారు విలేకరులతో మాట్లాడుతూ
ఈ గత 7 సంవత్సరాలుగా జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడిగా అనేక విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో విద్యార్థి నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నా కష్టాన్ని గుర్తించి ఈరోజు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఇంచార్జ్ లు మహమ్మద్ ఫహద్ మరియు ప్రతీక్ సింగ్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్న గార్లకు అలాగే నా నియామకానికి కృషిచేసిన జిల్లా కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నియమించిన జిల్లా ప్రధాన కార్యదర్శిలలో నాకు మొదటి ప్రాధాన్యత కల్పించడంతో నా మీద మరింత బాధ్యత పెరిగిందని జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడిగా ఎలాగైతే విద్యార్థి సంఘం బలోపేతానికి కృషి చేశానో అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా శక్తివంచన లేకుండా అహర్నిశలు విద్యార్థి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అలాగే నా ఈ ప్రయాణంలో నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నాకు సహాయ సహకారాలు అందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు నాతోటి జిల్లా కమిటీ ఎన్ ఎస్ యు ఐ సభ్యులకు,నాయకులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఇకపై కూడా మీ అందరి సహాయ సహకారాలు అమూల్యమైన సూచనలు నాకు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india