V1News Telangana

best news portal development company in india

బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

SHARE:

బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు .

విద్యార్థిని విద్యార్థులు పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ రహీం, నర్సింగ్ సూపర్డెంట్ శోభ పాల్గొని మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు. లక్ష్యం సాధించేవరకు ఎంత కష్టాన్నైనా భరించి సాధించాలన్నారు. అలా అనుకున్నది సాధించినప్పుడే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకువచ్చిన వారవుతారన్నారు. అనంతరం ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో పాటు నృత్యాలు చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గోదావరి, చైర్మన్ కిషన్, ఉపాధ్యాయునిలు రేఖ, అపర్ణ, ప్రియాంక ,నవీన్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india