V1News Telangana

best news portal development company in india

లోడింగ్ పేరిట మాజీ ప్రతినిధి దందా ఒక్కోటిప్పర్కు రూ.8,500 రేటు… *వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు ఖండ్గాం ఇసుక క్వారీ పరిశీలన… • నియంత్రణపై నేడు సబ్ కలెక్టర్ సమక్షంలో సమావేశం.. • ఉల్లంఘనలపై ఉదయం అధికారుల హెచ్చరికలు.. * మధ్యాహ్నం యథావిధిగా ఓవర్లోడ్ తో వెళ్లిన ఆనుక టిప్పర్లు.. అక్కడే ఉండే RI. గంగాధర్ తనకేమీ తెలిదయని చెప్పడం గమనార్హం…..

SHARE:

బోధన్ మండలంలోని సిద్ధాపూర్- కండ్ గాం గ్రామాల మధ్య ఉన్న ఇసుక క్వారీని రోడ్డు రవాణా శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్, బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్ పరిశీలించారు…

క్వారీ నుంచి పరిమితికి మిం టిప్పర్లల్లో ఇసుక రవాణా చేస్తుండటంపై సీరి యస్ అయ్యారు.
సబ్ కలెక్టర్ సమక్షంలో రోడ్డు రవాణా, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంవీఐ శ్రీనివాస్ తెలిపారు.

ఇసుక క్వారీని సందర్శించిన అధికారులు ఓవర్ బోడ్పై హెచ్చరించినా వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదు. అధికారులు క్వారీ నుంచి వెళ్ల గానే యథావిధిగా ఇసుక ఓవర్ లేక్తో టిప్పర్లు బయలుదేరాయి.

అధికారుల హెచ్చ రికలనూ పట్టించుకునే పరిస్థితులు కనిపిం చడం లేదు.

క్వారీ వద్ద వే బిల్లులు జారీ చేసేం దుకు మండల రెవెన్యూ అధికారి ఒక్కడే ఉండటం విశేషం.
బోధన్ నియోజకవర్గంలోని ఖండ్గావ్ సిద్ధాపూర్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలిక అనుమతులతో క్వారీ నడుస్తోంది. ఇక్కడ రోజుకు 60కిపైగా లారీలు ఆన్లైన్ వేబిల్లులు పొంది ఇసుకను తరలిస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో వేబిల్లుకు రూ.4,870 ప్రభుత్వానికి డీడీ చెల్లిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. లోడింగ్ పేరిట ప్రైవేటు వ్యక్తులు రూ. 8,500 అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు .

వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు
ఇసుక అక్రమ
దందాపై ఆటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులకు సమాచారం అందించినా పట్టిం దుకోవడం లేదనే విమర్శలున్నాయి. సదరు అధికారిని ఇసుక వ్యాపారులు ముందుగానే కలవడంతో ఇసుక అక్రమ వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.
ప్రభుత్వం నుంచి ఒక్క వే బిల్లు తీసుకొ .. నాలుగు టిప్పర్ల ఇసు కను తరలిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు. ఇసుక వ్యాపారులం తా రింగ్ ఏర్పడి అనుమతికి మించి ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖండ్గావ్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేరు చెప్పుకుని అక్కడ తిష్ట వేశాడు…
మంజీర నుంచి ఇసుకను ఒడ్డున వరకు చేర్చి తిరిగి వేబిల్లులు పొందిన టిప్పర్లలో నింపేందుకు రూ.8,500 వసూలు చేస్తున్నాడు.
ఇంత జరుగుతున్నా
ఇసుక టిప్పర్ల విషయంలో మైనింగ్ శాఖ అధికారు ల్లో చలనం లేకుండా పోయిందని శాఖ డివిజన్ అధికా బి చెప్పుకొచ్చారు. క్వారీ వద్దనే ఇసుక లోడ్ తూకం వేస్తే ఓవర్లోడ్ చెక్ పెట్టొచ్చని ఆర్టీవో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india