V1News Telangana

best news portal development company in india

వాహన దారులే అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.. అధికారులు దొంగ వేబిళ్ల సృష్టించి ఒక షాపులో విక్రయిస్తుంటే వారిపై చర్యలు ఎవరు తీసుకుంటారు.. ఈ వేబిళ్లను తనిఖీలు చేసేది ఎవరు… ప్రజలకు ఓ న్యాయం అధిక కారులకు ఓ న్యాయమా.గతంలో కూడా ఈ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు వినికిడి. ఇంత జరుగుతున్న ఈ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారు.. ఈ అధికారి వెనక ఎవరి హస్తముంది….

SHARE:

వాహన దారులే అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు..
అధికారులు దొంగ బేబీలు సృష్టించి ఒక షాపులో విక్రయిస్తుంటే వారిపై చర్యలు ఎవరు తీసుకుంటారు..
ఈ వేబిళ్లను తనిఖీలు చేసేది ఎవరు…
ప్రజలకు ఓ న్యాయం అధిక కారులకు ఓ న్యాయమా.

బోధన్ .
సిద్దాపూర్ కండ్గా పాయింట్ నుండి టిప్పర్‌లకు వే బిల్లులు , 15,000 రూపాయల రేటుకు ఇసుకను లోడ్ చేయడం జరుగుతుందని తెలుస్తుంది. లోడ్ చేసిన తరువాత, టిప్పర్ల యజమానుల నుండి తీసుకున్న DDలను MRO ఆఫీసు ద్వారా టిప్పర్ యజమానులకు విక్రయిస్తున్నారని, వాహనాలపై అదనపు రుసుము తీసుకుంటున్నట్టు..
ఒక షాప్ లో బేబీలు విక్రయిస్తున్నట్లు సమాచారం..

ఒక అధికారి, ఇసుక టిప్పర్ల వద్ద భారీగా వసూలు చేసి, సుమారు 10 ఇసుక టిప్పర్లను వదిలిపెట్టినట్లు సమాచారం. ఇసుక టిప్పర్లు జోరుగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నప్పటికీ, సంబంధిత శాఖాధికారులు మామూలు తీసుకోవడంలో మునిగిపోయి, ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

అనుమతుల పేరిట నంబర్ లేని వాహనాలు, అధిక లోడుతో వాహనాలు ఇసుకను తరలిస్తున్నాయి. లైసెన్సు లేని డ్రైవర్లు, అర్హత లేని డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు ఈ విషయాలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక మాఫియాకు రాజకీయ అండదండలు ఉండడం వల్ల, పోలీసులు, రెవెన్యూ మరియు ఇతర శాఖలపై ఒత్తిడి ఉండడం వల్ల, అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు  సబ్ కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా పై అధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారు లేదో వేచి చూడాలి మరి..

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india