V1News Telangana

best news portal development company in india

సర్ధార్ రవీందర్ సింగ్ vs ప్రసన్న హరికృష్ణ !*- మొదటి రెండో ప్రాధాన్యత ఓట్ల మెజారిటీతో మూడి పడి ఉంది – జాతీయ పార్టీలకు చెక్ పెట్టనున్న పట్టభద్రులు…. – సర్వేలో తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరి ప్రభావం

SHARE:

 ; కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ కు , రిటైర్డ్ ప్రొఫెసర్ గా ప్రసన్న హరికృష్ణ మధ్య పోటు ఉంటుందని సర్వే వర్గాల్లో తేలింది.

అయితే డప్పుల మోతలతో , సన్నాయి వాయిద్యాలతో , పట్టభద్రులతో కలిసి జై తెలంగాణ జైజై తెలంగాణ … ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో జనసందోహంగా కేసీఆర్ ఫోటో తో నామినేషన్ దాఖలు చేసిన సర్ధార్ రవీందర్ సింగ్ అందరికీ సుపరిచితుడైన వ్యక్తి అని సర్వేలో తేలింది.

కరీంనగర్ లో అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి , సమయంలో ఇక్కడి ప్రజల కోసం ఎన్నో సేవలు మరువలేనివి అని చెపుతున్నారు.

మాజీ మేయర్ గా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని , కుటుంబంలో పెద్దదిక్కు మృతి చెందితే దహన సంస్కారాలకు ఆర్థిక ఇబ్బందులు గురికావడం చూసి దేశంలోనే ఎక్కడలేని విధంగా కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకానికి శ్రీకారం చుట్టడని సర్వేలో
పేర్కొన్నారు .అంతేకాకుండా ఒక్క రూపాయికే నల్ల కనెక్షన్ , సరస్వతి ప్రసాదం ఇంకా మరెన్నో పథకాలు అమలు చేశామని అన్నారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే నేతలకు మండలిలో అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుకనై గళమెత్తి పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతానని భరోసా ఉందని సర్వేలో రాశారు.
పట్టభద్రుల కోసం ఒక్క రూపాయికే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భీమా పథకాన్ని స్వయంగా కల్పిస్తానని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ఓటే వేయాలని సభల్లో కోరారు.

విద్య అమ్ముకునేవాళ్ళు , వ్యాపారం చేసేవారు మనకు వద్దు… ఆలోచించి పట్టభద్రులు ఓటు వేయాలని ..బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని “పట్టభద్రుల మద్దతు తనకే ఉందని ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు.

ఇదిలావుండగా రిటైర్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కు అవకాశం ఇస్తే బాగుంటుందని మరో సర్వేలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ తో టచ్ లో ఉంటూ … బీఆర్ఎస్ గూటికి చేరేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పెద్ద సారు అపాయింట్మెంట్ ఇయ్యాని విషయం తెలిసిందే . తర్వాత బీఎస్పీ చేరి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం విడిచి పట్టభద్రుల కోసం వచ్చానని హరికృష్ణ అంటుంటే .. రాత్రికి రాత్రే తెల్ల చొక్కాలు వేసుకుని రాలేదు అంటూ సర్ధార్ రవీందర్ సింగ్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
అయితే ఇరువురి మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుందని సర్వే లో తేలింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india