– ఎమ్మెల్సీ ఎన్నికలలో తన భర్తను గెలిపించాలని పట్టభద్రుల కు విజ్ఞప్తి
– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి
– గత ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పరిపాలనలో విద్యారంగ, నిరుద్యోగుల సమస్యలు కుంటుపడ్డాయి
– బిజెపితోనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యలు
– ఎమ్మెల్సీ అభ్యర్థి సతీమణి గోదావరి
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి సతీమణి గోదావరి బాన్సువాడ పట్టణానికి విచ్చేసి భర్త గెలుపు జోరుగా, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు హక్కును మొదటి ప్రాధాన్యత చిన్నమైల్ అంజిరెడ్డి కి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుపరచలేక మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో విద్యారంగ సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అధ్వానంగా ఉన్నాయని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓటు హక్కును అడిగే నైతిక విలువలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపితోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని విజ్ఞప్తి చేశారు. యావత్ భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని స్వాగత్తున్నారని అన్నారు. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అందించిన భారీ విజయం అందుకు నిదర్శనం అని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి ప్రపంచ దేశాలు కూడా అభినందిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఆయనపై విమర్శలు చేస్తూ చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బాపిరెడ్డి, మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








