V1News Telangana

best news portal development company in india

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు….

SHARE:

– ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కొరకు ముమ్మర ప్రచారం

– గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి బిజెపి అభ్యర్థులు అంకితభావంతో పని చేస్తారని విజ్ఞప్తి

– బిజెపి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేస్తూ ఉపాధ్యాయులను మరియు పట్టభద్రులను విజ్ఞప్తి చేశారు. బిజెపి అభ్యర్థులను గెలిపించినట్లయితే ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తారని .. శాసనమండలిలో తమ గొంతు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి హక్కుల సాధన కొరకు సేవకులుగా పనిచేస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్, అరిగె నారాయణ, కంది పెద్ద మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india