V1News Telangana

best news portal development company in india

SBI క్లర్క్ పరీక్ష తేదీని వాయిదా వేయాలి….

SHARE:

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రోజే SBI క్లర్క్ పోటీ పరీక్ష

– బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన పట్టభద్రులు

– ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరీక్ష తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి

– బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ వ్యాఖ్యలు

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీసీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు పట్టభద్రులు బాన్సువాడ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా అదే రోజు SBI క్లర్క్ పోటీ పరీక్షను నిర్వహిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మరియు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరీక్ష తేదీని వాయిదా వేసే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించామని తెలిపారు. ఒకే రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు పోటీపరీక్ష ఉండడం వల్ల పట్టభద్రులు అయోమయంలో ఉన్నారని వాపోయారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మా హక్కు.. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. దీనిపై ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా స్పందించి స్థానిక కలెక్టర్ కార్యాలయాలలో మరియు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరీక్ష తేదీని వాయిదా వేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఇప్పటివరకు ఈ విషయంపై ఎమ్మెల్సీ అభ్యర్థులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.దాదాపు వందమంది పట్టభద్రులు SBI పోటీ పరీక్షకు హాజరైనట్లయితే ఎన్నికల పట్ల అధికారులకు, నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే అవుతుందని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల గెలుపు ఓటములు ఒక ఓటు తోనే తారు మారవుతుందని అలాంటిది ఈ విషయంపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలలో పరీక్ష తేదీని వాయిదా వేశారని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తప్పకుండా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పట్టభద్రుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సాయికుమార్, జ్ఞానేశ్వర్, పెంట సాయి, పుట్ట వినయ్ కుమార్, బాలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india